• ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు పై రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో స్పందించారు. చంద్రబాబు అరెస్టుపై వివరాలు ఆమె మాటల్లోనే……
*ఈ రోజు ఉదయం సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు..
• చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దుర్ధేశం, కుట్రలు లేవు :
• సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు..
• భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్ లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పినా మాట వినలేదు..
• ఆయన ఎందుకు నిరాకరించారో అందరకీ అర్థం అవుతుంది..?
• స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలో జరిగిన స్కామ్ ను మొదట గుర్తించింది 2017లో అంటే గత ప్రభుత్వంలోనే..
• ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయి..
• గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ కుట్రలతో అరెస్ట్ చేయించారు.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాల వల్ల జరిగింది.
• రాజకీయ కుట్రలు చేసేది టీడీపీనే.. అందరూ గమనించాలి..
• చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఆయనకు తెలసు కాబట్టే గత మూడు రోజులుగా సానుభూతి కోసం పాకులాడారు..
• పురందేశ్వరి అరెస్ట్ లను ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలి..
• పురందేశ్వరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? అమిత్ షా పై రాళ్లు వేయించిన.. మోదీని తిట్టించిన వారిని ఆమె సమర్థిస్తుందా…?
• పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా..? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా..?
• ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా..? సమాధానం చెప్పాలి.
• ఇన్నాళ్లు మాట్లాడని పవన్ కళ్యాణ్.. ఈ రోజు ముందుకొచ్చారు.. అంటే ఈ స్కాంలో పవన్ కళ్యాణ్ కు అందుతున్న ప్యాకేజీ ఎంత..?
[zombify_post]