in ,

రూ.1.20 కోట్లతో ఎంపీటీసీ సభ్యుడు పరార్

తూర్పుగోదావరి జిల్లా: చిట్టీలు, అప్పులు రూపంలో సుమారు రూ.1.20 కోట్లతో ఉడాయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో జరిగింది.  స్థానికుల వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం ముత్యాలమ్మపేటకు చెందిన కె.మోహనరావు వృత్తిరీత్యా దర్జీ. భార్య, ఇద్దరు పిల్లలతో ఇక్కడే నివసిస్తున్నారు. వైకాపా ఆవిర్భావం నుంచి అందులోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం 12వ వార్డు సభ్యుడు. 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్థానికుడు కావడం, ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నాడనే నమ్మకంతో సుమారు 50 నుంచి 60 మంది చిట్టీలు కట్టారు. మరికొందరు వడ్డీలకు ఆశపడి అప్పులు ఇచ్చారు. గత అయిదారు నెలలుగా చిట్టీలు పాడుకున్న వారికి అతడు సొమ్ము ఇవ్వట్లేదు. 20 రోజుల నుంచి కనిపించకపోవడంతో కుటుంబంతో సహా వెళ్లిపోయినట్లు గుర్తించారు. బాధితులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నామని ఎస్సై రామారావు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

కార్గో సేవలు ఉపయోగించుకోండి