- *సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ*
*సమైక్య రాష్ట్రంలో వీరుల చరిత్ర కనుమరుగు*
*బావి తరాలకు వీరుల గాథలు తెలియాలి*
కరీంనగర్ జిలా:
*జూబ్లీ నగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్*
నాడు తీవ్ర వివక్షను ఎదిరించి ఆత్మగౌరవం కోసం నిజాంకు వ్యతిరేకంగా బందుకును చేతబట్టి సాయుధ పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీ నగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పాలకులు వీరుల చరిత్ర కనుమరుగు చేశారని..కానీ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బలహీన వర్గాల వీరుల చరిత్ర తెలిసేలా పాఠ్య పుస్తకాలలో పెట్టడంతో పాటు చాకలి ఐలమ్మ జయంతి అధికారికంగా జరపాలని నిర్ణయించడం వారికి ఇచ్చిన విలువ అని అన్నారు. ఒకప్పుడు వెనుకబడిన తరగతులకు విద్య అందలేదని ..కేవలం కుల వృత్తులు చేసుకొని బతకాలని వెనక్కి నెట్టివేసారని అన్నారు. కానీ నేడు స్వయంపాలన లో ముఖ్యమంత్రి కెసిఆర్ కులవృత్తులకు చేయూతను అందించడమే కాకుండా తమ బిడ్డల్ని చదివిస్తూ విదేశాలకు పంపించి గర్వంగా జీవించేలా చేశారన్నారు. సమైక్య పాలనలో వీరుల చరిత్ర తెలిస్తే గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసే వారని…ఇప్పుడు గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు వీరుల గాథలు తెలిసేలా చేయడం అభినందనీయమని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ను కాపడుకోవలని..ఢిల్లీ పాలకుల చేతిలో తెలంగాణ ను పెడితే మళ్ళీ మన వనరులు, సంపద దోచుకుంటారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు,బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!