in ,

ప్రత్యామ్నాయ పంటలు లాభదాయకo

రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా: జిల్లాలో వరి సాగుతో వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల రైతుల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత , జిలా కలెక్టర్ డా కె. మాధవీలత లు పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదల మరియు వ్యవసాయ సలహా మండలి ప్రత్యేక సమావేశం హోం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హోం మంత్రి డా తానేటి వనిత మాట్లాడుతూ, వరి పంట సాగు కోసం అత్యధిక స్థాయి లో నీటి వనరులు వినియోగం చెయ్యవలసి ఉంటుందని పేర్కొన్నారు. రైతుల్లో వరి బదులు ప్రత్యన్మయ పంటలైన మొక్క జొన్న, కంద తదితర లాభసాటి పంటల సాగు చేసేలా రైతులని ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనతో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి ఇతర పంటల సాగు పద్ధతులు పై అవగాహన పెంచి ఆయా పంటల సాగు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కువ సాగునీటి వినియోగం ద్వారా పండించే లాభదాయకమైన పంటలు పై దృష్టి పెట్టి, రైతులకి ఆమేరకు అవగాహన కలుగ చెయ్యాల్సి ఉంటుందని తానేటి వనిత స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాలని, జగనన్న ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షపాతం నమోదు లో 25 శాతం తక్కువ నమోదు కావడం జరిగిందన్నారు. రైతుల్లో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై అవగాహన కలిగించడం తో పాటుగా ఇతర పంటల సాగుపై రైతుల్లో చైతన్యం తీసుకుని రావలసిన అవస్యకత ఎంతైనా ఉంది అని స్పష్టం చేశారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఇరిగేషన్, వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించి, క్షేత్ర స్థాయి లో నీటి వనరులు లభ్యత, వర్షభావ పరిస్థితులు పై సానుకూల చర్చలు జరపాలని పేర్కొన్నారు.  వ్యవసాయ, జలవలనరులు, రెవెన్యూ అధికారులు మధ్య సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయా నిర్ణయాలను ఆచరణలో పెట్టడానికి మండల, అర్భికే స్థాయి సలహా మండలి సమావేశం లో ఉంచి రైతులకు అవగాహన కలుగ చెయ్యాలని కోరారు. వర్షభావ పరిస్థితి లో కూడా సానుకూల దృక్పథంతో కూడిన సాగు చెయ్యతగ్గ పంటలపై రైతులకు పూర్తి స్థాయి లో అవగాహన ముఖ్యం అన్నారు.
పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, నది గర్భంలో తగినంత నీరు నిలవ ఉండేలా ఎప్పటి కప్పుడు సిల్ట్ తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అధికారులు గణాంకాలు వివరిస్తూ, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సానుకూలంగా వర్షభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 71980 హెక్టార్ల లో నాట్లు పూర్తి అయి ఇప్పటి వరకు 91.37 శాతం మేర వరి నాట్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నాట్లు పూర్తి అయి సానుకూలంగా పరిస్థితి ఉందని అన్నారు. జిల్లాలో సాగు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో జూన్ 1 నాటికి సాగునీటి విడుదల చేసినా, వర్షభవా పరిస్థితిలో కొంత నాట్లు ఆలస్యం అయినా, ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా, ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిధిలో 10,13,161 ఎకరాల ఆయకట్టు లో సాగు విస్తీర్ణం ఉన్నట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు వల్ల ఇప్పటి వరకు 1777.601 టి ఏం సి జలాలు సముద్రంలోకి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత కుమార్,  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఇరిగేషన్ ఎస్ ఈ జీ. శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, స్థానిక ప్రజా ప్రతినిదులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

నంద్యాల జిల్లా శ్రీశైలంలో విశేష పూజలు

గురు సాక్షాత్ ప‌ర‌బ్ర‌హ్మ‌.. త‌స్మైశ్రీ గురువే న‌మః