in ,

కొవ్వూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా విడుదల

కొవ్వూరు: నియోజకవర్గం లో బూతుల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇటీవల చేసిన మార్పులు చేర్పులతో సహా ఓటర్ల జాబితాలను బూత్ ల వారి ప్రచురణ కార్యక్రమాన్ని చేపట్టామని నియోజకవర్గ ఎన్నికల అధికారి మరియు కొవ్వూరు ఆర్డీవో ఎస్ మల్లిబాబు తెలిపారు. ఈ నెల 27 నుండి డిసెంబర్ 9 వరకు ఈ జాబితా లను ఓటర్లు పరిశీలించుకుని అవసరమైన వారు చేర్పులు, మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఓట్ల నమోదు కునవంబర్ 4,5 మరియు డిసెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. దయచేసి ఎవ్వరూ అశ్రద్ద చేయకుండా కుటుంబ సభ్యుల ఓట్లు కూడా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని పేర్కొన్నారు.ఓటు లేకుంటే ఎందుకులే అని అశ్రద్ద చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు చాలా విలువైనదని పేర్కొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

అన్నసమారాధన లో పాల్గొన్న హోం మంత్రి వనిత

దీపావళి కానుకగా 50% మధ్యంతర వృత్తి(ఐఆర్) ప్రకటించండి…ఎస్టీయూ