దేవరాపల్లి, అనకాపల్లి జిల్లా:
మండలంలోని ఏ.కొత్తపల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలకు చెందిన రెడ్డి నారాయణమూర్తి, కరక దొంగబాబు, కొటన రాజబాబు, అచ్చిబాబు, బూరె అప్పారావు మొదలైన వారు గ్రామ సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. వీరందరూ టిడిపి ఆవిర్భావం నుండి బలమైన కార్యకర్తలుగా ఆ పార్టీ కి సేవలందించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సమక్షంలో వైసీపీలో చేరగా, వారికి వైసిపి కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎల్లవేళలా వారికి అండగా ఉంటూ, ఏ సమస్య వచ్చిని శక్తివంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో ఎల్లగా టిడిపి పార్టీకి కొమ్ముకాచిన మొండిచేయి చూపించారని, అ పార్టీ నాయకులు ఉన్నత పదవులు అనుభవించి కాలయాపన చేశారని, తమ సమస్యలు పట్టించుకోలేదని, కానీ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలతో పాటు, మౌలిక వసతులు కల్పిస్తున్న బూడి ముత్యాల నాయుడు నాయకత్వం పై తమకు ఎనలేని నమ్మకం ఉందని నూతనంగా చేరిన వారు కొనియాడారు. ఇకపై గ్రామంలో ఒకే పార్టీ ఒకే నినాదంతో కొనసాగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు రాజబాబు, గ్రామ వైసిపి నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]