in ,

అన్నసమారాధన లో పాల్గొన్న హోం మంత్రి వనిత

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో  దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. చాగల్లు మండలం చాగల్లు సచివాలయం పరిధిలోని మీనానగరంలో భారీ అన్న సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ ముత్యాలమ్మ దిబ్బ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం  నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు.. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత అగ్రస్థానంలో నిలుస్తు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. అందుకు తమ సహాయ, సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.  కనకదుర్గ అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

#AP_CM_YSJAGA

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

గోష్పాద క్షేత్రం లో అక్రమ కట్టడాలను నిలిపివేయాలి

కొవ్వూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా విడుదల