in ,

చంద్రబాబు అరెస్టు అయితే అయ్యో పాపం అన్నవాళ్ళు లేరు- హోంమంత్రి వనిత

విశాఖపట్నం : చంద్రబాబు అరెస్టు అయితే  అయ్యో పాపం అన్నవాళ్ళు లేరని హోంమంత్రి తానేటి వనిత ఎద్డేవా చేశారు. సోమవారం ఆమె విశాఖపట్నం లో మీడియాతో  మాట్లాడిన ఆమె.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ ప్రమేయం ఉందన్నారు.. పూర్తి విచారణ తర్వాత బాధ్యులైన అందరినీ ఫిక్స్ చేస్తాం అన్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ముప్పు లేదు.. ప్రజలలో సానుభూతి కోసమే టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.. జనసేన, టీడీపీ అరాచకాల నుంచి ప్రజలను కాపాడ డానికే రాష్ట్రంలో 144 అమలు చేశాం అన్నారు. విశాఖలో జరిగిన జాతీయ జైళ్ల శాఖ ఉన్నతాధికారుల సమావేశానికి హాజరైన వనిత.. చంద్రబాబు కంటే ఎక్కువ వయసు ఉన్న చాలా మంది ఇతర రాష్ట్రాలలో ఆర్ధిక నేరాల్లో అరెస్ట్ అయ్యారని గుర్తుచేశారు.. చట్టం ముందు చంద్రబాబు వయసు మినహాయింపు కాదు అదంతా సానుభూతిని పొందే ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

[zombify_post]

Report

What do you think?

మృతుని కుటుంబానికి మాజీమంత్రి సంబానీ పరామర్శ

సత్తుపల్లిలో యువత మిస్సింగ్