in ,

చంద్రబాబు అరెస్టు లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు: హోంమంత్రి తానేటి వనిత

• ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు పై రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో స్పందించారు. చంద్రబాబు అరెస్టుపై వివరాలు ఆమె మాటల్లోనే…… 

*ఈ రోజు ఉదయం సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు..  

• చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దుర్ధేశం, కుట్రలు లేవు : 

• సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు..  

• భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్ లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పినా మాట వినలేదు..

• ఆయన ఎందుకు నిరాకరించారో అందరకీ అర్థం అవుతుంది..?  

• స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలో జరిగిన స్కామ్ ను మొదట గుర్తించింది 2017లో అంటే గత ప్రభుత్వంలోనే..  

• ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయి..  

• గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ కుట్రలతో అరెస్ట్ చేయించారు.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్  ఆయన చేసిన తప్పిదాల వల్ల జరిగింది.  

• రాజకీయ కుట్రలు చేసేది టీడీపీనే.. అందరూ గమనించాలి..  

• చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఆయనకు తెలసు కాబట్టే గత మూడు రోజులుగా సానుభూతి కోసం పాకులాడారు..  

• పురందేశ్వరి అరెస్ట్ లను ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలి..  

• పురందేశ్వరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? అమిత్ షా పై రాళ్లు వేయించిన..  మోదీని తిట్టించిన వారిని ఆమె  సమర్థిస్తుందా…?  

• పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా..? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా..?  

• ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా..? సమాధానం చెప్పాలి.  

• ఇన్నాళ్లు మాట్లాడని పవన్ కళ్యాణ్.. ఈ రోజు ముందుకొచ్చారు.. అంటే ఈ స్కాంలో పవన్ కళ్యాణ్ కు అందుతున్న ప్యాకేజీ ఎంత..?  

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబునాయుడు అరెస్టుతో .

వ్యాధులు దరిచేరకుండా అప్రమత్తంగా ఉండాలి