కొవ్వూరు: కృష్ణ పరమాత్మ అనుగ్రహం లేనిది జీవులలో కదలిక ఉండదని తిరుపతి వశిష్టాశ్రమ లలితా పీఠాధిపతులు శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి అన్నారు. కొవ్వూరు ఫ్యాక్టరీ క్లబ్ ఆవరణలో శ్రీమద్ భగవద్గీత విశ్వరూప సందర్శన యాగం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొవ్వూరు పట్టణంలోని పలువురు ఆధ్యాత్మికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!