రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా: గురువుగా విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన ఆదర్శనీయడు డా.సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున గురుపూజోత్సవంగా ఆయనను స్మరించుకోవడం మన అందరి భాద్యతని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా.తానేటి వనిత పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్ పి మార్గాని భరత్ రామ్, ఎమ్ఎల్సీ వంకా రవీంద్రనాధ్, కలెక్టర్ డా. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, నగరపాలక సంస్థ కమీషనర్ కే. దినేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పమాల వేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరినీ భావిభారత ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే భాద్యత ఉపాద్యాయుల పై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలో మౌలిస పసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా.తానేటి వనిత పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యశించాలన్న లక్ష్యంతో విద్యా దీవెన, వసతి దీవేన, విదేశీ విద్యా, అమ్మఒడి, గోరుముద్ద,నాడు నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. ప్రతి పిల్లవాడికి ప్రధమ గురువు తల్లి అయితే సమాజంలో వారి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఉండేందుకు గురువు ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. అటువంటి గురుపూజా దినోత్సవం రోజున వారందరికి పేరుపేరనా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన్నారు. గురువు లేకుంటే సమాజంలో సాంకేతికతను అందించే ఇంజినీరుని,, వైద్యాన్ని అందించే డాక్టరును, న్యాయాన్ని అందించే న్యాయ మూర్తులను సమాజానికి అందించేంది గురువు వలననే సాద్యమవుతుందన్నారు. గత ప్రభుత్వాల్లో పాఠశాల విద్య పట్ల చిన్నచూపు ఉండేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాఠశాలలకు ప్రత్యేక ప్రాధాన్యత నిస్తూ అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. ఆధునిక టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతున్నారని,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు.ఎమ్.పి. మార్గాని భరత్ మాట్లాడుతూ గురువులు వ్యక్తి వికాసానికి మార్గం వేస్తారన్నారు. విద్యార్థులు, యువకులు నూరుశాతం విద్య అభ్యసిస్తే దేశం ఉన్నతిలో ఉంటుందన్నారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని స్మరించుకుంటూ…విద్యార్థి, తద్వారా సమాజ భవిష్యత్తు తరగతి గదిలో తయారవు తుందన్నారు. ఉపాధ్యాయుల పిల్లలు నైపుణ్యాలను పెంచాలన్నారు. విద్యార్థి ఆసక్తిని గమనించి బోధన చేయాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 68 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నారన్నారు. ప్రతి రూపాయి మౌలిక వసతులకే పూర్తి పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారన్నారు. పాఠశాల విద్యలో ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. పేద పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలంటే ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అని, అందుకే ఇంగ్లీష్ బోధనకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. తెలుగు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తున్నారని, తెలుగు మీడియం విద్యార్థులకు కూడా సులభతరంగా అర్ధమయ్యే విధంగా మొట్టమొదటిసారిగా ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా ఆడపిల్లలకు సానిటరీ నాప్కిన్స్ కూడా అందజేస్తున్నారు.ఎమ్మెఎల్సీ వంకా రవీంద్రనాధ్ మాట్లాడుతూ సుమాజంలో గురువులది ఉత్తమ మైన స్థానమని, భావిభారత పౌరులను ఉత్తమ విలువలతో విద్యనేర్పాలన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర కీలకమైనదన్నారు. ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులకు బోధన పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవార్డు పొందిన ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించే ప్రతి ఒక్కటీచర్ ఉత్తమ ఉపాధ్యాయులే అన్నారు. ఉపాధ్యాయులు అందరూ తమ విధులను అంకిత భావం తో నిర్వహించాలన్నారు. చదువుతో పాటు జీవితంలో అన్నిఅంశాల్లో మానసిక ధైర్యంతో ఎదుర్కొనే విధంగా గురువులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ బ్రహ్మ నుదుటి రాత రాస్తే ఉపాధ్యాయుడు ఆ వ్యక్తి రాతను మార్చే సృష్టికర్త అని అన్నారు. తనను ఐఏఎస్ గా చేసిన అమ్మా నాన్నలను గురువులను తలుచుకున్నారు. సమాజంలో ఉత్తమ వ్యక్తులను తయారుచేసే బాధ్యత టీచర్లదే అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ భావితరాలకు ఇచ్చే ఆస్తి విద్య అంటూ ఉంటారని, ఆ విధంగా కుటుంబ సామాజిక, ఆర్థిక అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని అన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి మనం న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటున్నారన్నారు.
జిల్లా విద్యా శాఖాధికారి ఎస్ అబ్రహాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎన్నో నిధులు విడుదల చేస్తూ నాడు నేడుతో ఎన్నో వసతులు కల్పిస్తోందన్నారు. డా. అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యార్థులను ఉత్తేజితులను చేసే విధంగా బోధన ఉండాలన్నారు.ఈ సందర్బంగా జిల్లాలోని 19 మండలాల నుండి ఎంపికైన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను హోం మంత్రి తానేటి వనిత,ఎం.పి భరత్ రామ్,జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, మెమెంటో, శాలువతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు వంకా రవీంద్ర నాధ్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్,ఏ.పి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చైర్మన్ పిల్లి నిర్మల కుమారి, డా.గూడూరి శ్రీనివాస్,రౌతు సూర్యప్రకాశరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజమహేంద్రవరం డివిజన్ ఉపవిద్యా శాఖాధికారి ఎం.తిరుమలదాస్, అర్బన్ రేంజ్ డిఐబిదిలీప్ కుమార్, రూరల్ ఎం.ఈ ఓ ఏ.దుర్గా తులసి దాస్,కడియం ఎం ఈ ఓ లజపతి రాయ్,డి సి ఈ బి సెక్రటరీ అనిత, పి.ఈ టి అసోసియేషన్, రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రమణరావు, మంగిన రామారావు, జి రమేష్,సిఆర్పిలు జయంతి శాస్త్రి, జె.శ్రీనివాసరావు, అర్బన్ గల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]