*గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురువే నమః*
*మీరు నా కృష్ణుడు, నేను మీ అర్జునుడిని.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను శ్రీ కృష్ణుడితో పోల్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవార్ రామారావ్ పటేల్ గారు…*
ముధోల్ నియోజక వర్గం భైంసా పట్టణంలోని పురాణ బజార్ *సర్వేశ్వర్ విద్య మందిర్* పాఠశాలకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన *ముధోల్ నియోజక వర్గ బీజేపీ నాయకులు శ్రీ పవర్ రామారావు గారు.* ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పురాణాల నుంచి నేటి వరకు భారతదేశంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. బడిని గుడిలా, ఉపాధ్యాయులను దేవుడిలా పూజిస్తారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎనలేనిది. పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారు అని ఈ సందర్భంగా తెలియజేశారు . ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉపాద్యాయులు, విద్యార్ధులను బిజేపి నేతలు , తదితులున్నారు.

[zombify_post]