మహబూబాబాద్ జిల్లాలో తొలిసారిగా ప్రభుత్వం నూతనంగా ఇంజనీరింగ్ కళాశాల 2023-24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నందున దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.
మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలో నూతనంగా ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయినందున ఏర్పాట్లు, అడ్మిషన్లు, నిర్వహణ తీరును సమీక్షించేందుకు సంబంధిత ఇంజనీరింగ్ అధ్యాపకులుతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 2023-24 విద్యా సంవత్సరంనకుగాను ఇంజనీరింగ్ విద్య అభ్యసించేవారు ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంసెట్ ప్రవేశ పరీక్ష పాసై ఉండాలన్నారు. కళాశాలలో ప్రవేశం కొరకు ముందుగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 600 రూ.లు, ఇతరులు 1200 రూలు చెల్లించాలని తెలిపారు.
Secretary, T.S. CHE Eamcet Admissions, 2019 పేరుతో డిమాండ్ డ్రాఫ్టు తీసి JNTUH, College of Engineering, Mahabubabad.
Old Collectorate, Indhira nagar, Tallapusapalli road, Mahabubabadకు గాని, Govt. Polytechnical, Mosab tank, Hyderbadకు గాని, JNTUH, College of Engineering, Palair Block’B Barugudem, Arempula, Khammam Dist కు గాని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
దరఖాస్తు తో పాటు
1. ఎంసెట్ ర్యాంక్ కార్డు,
2. ఎంసెట్ హాల్ టికెట్,
3. ఆధార్ కార్డు,
4. ఎస్ ఎస్ సి మెమో,
5. ఇంటర్ మెమో,
6. ఫిఫ్త్ టు ఇంటర్ స్టడీ సర్టిఫికెట్,
7. కుల ధ్రువీకరణ పత్రము
8. ఆదాయ ధ్రువీకరణ పత్రము.
9 .లోకల్ ఏరియా ధ్రువీకరణ పత్రము
జతపరిచి సమర్పించవలసి ఉంటుందన్నారు.
ఇతర విషయాలకు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రిన్సిపాల్ డాక్టర్ బలరాం నాయక్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెల్ నెంబర్ 9052875020 సంప్రదించవచ్చునని తెలియజేశారు. ఈ కళాశాలలో సి.ఎస్.ఈ., సి.ఈ. డాటా సైన్స్., ఈ.సి.ఈ. కోర్సులు ఉన్నాయని ప్రతి కోర్సులోనూ 60 సీట్లు ఉన్నాయని తెలిపారు
[zombify_post]