జగిత్యాల :మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించడం, అలాగే కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు "నారీ శక్తి వందన" మహిళా కోట రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయం.
భారత దేశ మహిళల తరుపున , మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల తరుపున నరేంద్ర మోడీ గారికి , కేంద్ర మంత్రి వర్గానికి, భారతీయ జనతా పార్టీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు. కచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం.మహిళా రిజర్వేషన్ బిల్లు ను గతంలో కూడా మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది NDA ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది BJP నే. త్వరలో బిల్లు అమలు చేసేది BJP ప్రభుత్వమే.గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కమిటీల్లో ను 33% రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్ధి నీ చాటింది. ఆర్థిక, విదేశీ వ్యవహారాల, రక్షణ లాంటి కీలక శాఖ లను సైతం మహిళల కు కేటాయించింది. భారత రాష్ట్రపతి గా మహిళను గౌరవాన్ని ఇస్తూ,12 మందిని కేంద్ర మంత్రులు గా , 8 మందిని గవర్నర్ లు గా , నలుగురు మహిళలను ముఖ్య మంత్రులు చేసిన ప్రభుత్వం BJP ప్రభుత్వం. దేశ చరిత్ర లో తొలి సారి పార మిలటరీ దళాల్లో సైతం మహిళలకు చోటు నిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపి పారేసిన పార్టీ లతో అంట కాగుతు , సొంత పార్టీ లో ఏ ఒక్క కమిటీ లో మహిళల కు స్థానం ఇవ్వని BRS పార్టీ అసలు రంగు ఉబయ సభల్లో బిల్లు కు మధ్ఛతు ఇచ్చేటప్పుడు బయట పడ్తది.కేవలం మహిళల ఓట్ల కోసం ఎజెండా పెట్టే INDI కూటమి నిజంగా మహిళల కు సమ న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయ్ బిల్లు కు బేషరతుగా మద్దతు ఇవ్వాలి అని భోగ.శ్రావణి డిమాండ్ చేశారు.
[zombify_post]