మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ బిల్లు మీ ఆమోదంతో చట్టంగా మారుతుందని మహిళలందరికీ భరోసా ఇస్తున్నా. మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకోని ఈ బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ కీలక నిర్ణయం మహిళా సాధికారత ప్రారంభానికి నాంది పలుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది సెప్టెంబరు 19 దేశ చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
