*నగర ప్రజల సంక్షేమమే ధ్యేయం…పార్టీలకతీతంగా అభివృద్ధి*
*నగర పౌరుల గౌరవం పెరిగేలా అధ్భుత నగరంగా తీర్చి దిద్దుతా*
*భవిష్యత్ తరాలకు గొప్ప నగరాన్ని అందించాలనేదే లక్ష్యం*
*నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న*
*రివర్ ఫ్రంట్ తో నగరానికి పర్యాటక శోభ*
*రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్*
కరీంనగర్ జిల్లా:
కరీంనగర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా..పార్టీలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. 133 కోట్ల సిఎం హామి నిధులతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు… ఎస్ డబ్ల్యూజీ పైప్ లైన్… మంచినీటి పైప్ లైన్… పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు మేయర్ సునిల్ రావుతో కలిసి… డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. తొలుత 58వ డివిజన్ చేరుకున్న మంత్రి గంగుల… స్థానిక కార్పొరేటర్ గందె మాధవి మహేష్ తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు… అక్కడి నుండి 42వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ మేచినేని వనజా అశోక్ రావుతో కలిసి… డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించిన పనులను ప్రారంభించారు. అక్కడి నుండి 40వ డివిజన్ బ్యాంకు కాలనీ రోడ్డు నెంబర్ వన్ కు చేరుకున్న మంత్రి గంగుల… స్థానిక కార్పొరేటర్ భూమాగౌడ్ తో కలిసి… అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి 17వ డివిజన్ హరిహరనగర్ రోడ్డు నెంబర్ 8 లో స్థానిక కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ తో కలిసి సిసి రోడ్డు… డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు… ఆ తర్వాత 14వ డివిజన్ మంకమ్మతోట వెంకటేశ్వర టెంపుల్ వద్దకు చేరుకుని స్థానిక కార్పొరేటర్ డిండిగాల మహేష్… డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు యాగండ్ల అనీల్ తో కాలనీ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి 15వ డివిజన్ సాయిబాబా ఆలయం వద్ద స్థానిక కార్పొరేటర్ నాగసముద్రం జయలక్ష్మి తో కలిసి అభివృద్ది పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు….
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర పౌరుల గౌరవం పెరిగేలా అధ్భుత నగరంగా తీర్చిదిడ్డుతున్నమని, భవిష్యత్ తరాలకు గొప్ప నగరాన్ని అందించాలనేదే లక్ష్యం అని అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు అని గెలిచిన తరవాత అందరూ నావల్లేనని, తనని నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. నగరంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గతంలో ఉన్న నాయకులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రావడంతో నగర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఎక్కడ చూసినా గుంతల రొడ్లతో నగరానికి వచ్చేందుకు వెనుకాడే వారని కానీ నేడు కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులతో నగరం అధ్బుతంగా మారిందని అన్నారు. సమైక్య పాలనలో నగర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరితే ముఖం చాటేశారనీ, కానీ నేడు స్వయంపాలన లో ముఖ్యమంత్రి కెసిఆర్ కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరారు.నాది కరీంనగర్ అని గొప్పగా చెప్పు కునేలా నగరాన్ని అభివృద్ది చేస్తున్నాననీ, ఇందుకోసం సిఎం కెసిఆర్ సహకారంతో కోట్లాది రూపాయలు తీసుకువచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దు తున్నానన్నారు. ఎన్నికల వేళ… పచ్చని తెలంగాణలో విషం చిమ్మేందుకు కాంగ్రెస్… బిజెపిలు విషం చిమ్ముతున్నాయని… ఆయా పార్టీల పట్ల అఫ్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ది సిఎం కెసిఆర్ తో నే సాధ్యమని… మరోసారి ఆశీర్వదిస్తే… మరింత అభివృద్ది చేసి చూపిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి – హరిశంకర్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!