ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి.
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించి ఆమోదించాలి.
–సూర్యాపేట జిల్లా ఇన్చార్జి తూరుగంటి అంజన్న మాదిగ
సూర్యాపేట సెప్టెంబర్ 22:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా ఇన్చార్జి తూరుగంటి అంజన్న మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ను ముట్టడి చేశారు. ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులకు తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణము ఏర్పడింది. పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతోఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నాయకుల్ని శాంతింపచేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఇన్చార్జి తూరుగంటి అంజన్న మాదిగ మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెద్దలారా మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను 100 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చి నేటికి పది సంవత్సరాలు గడిచింది మాయమాటలు చెప్పి మాదిగల్ని మోసం చేసిన బిజెపి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.దీన్ దయాల్ సిద్ధాంతం ప్రకారం సమన్యాయం కోసం పరితపించారు వారి సిద్ధాంతం ప్రకారం మా ఉద్యమం ప్రజాస్వామ్య బద్ధమైనది,న్యాయమైనది ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇవ్వాని మందకృష్ణ మాదిగ ఒక్క మాదిగలకే కాకుండా సమాజంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలకు ,వికలాంగుల కొరకు వృద్ధులు వితంతువుల కొరకు గుండె జబ్బుల పిల్లల కోసం అనాధ పిల్లల కోసం గత మూడు దశాబ్దాల నుండి నిరంతరం పోరాడుతున్నారు. శుక్రవారం జరిగే చివరిపార్లమెంటు సమావేశాలలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించాము.కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో జిల్లా కో ఇన్చార్జి ములకలపల్లి రవి, ఎంఎస్పి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎర్ర వీరస్వామి, బోడ శ్రీరాములు సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి పుట్టల మల్లేష్ ,కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏపూర్ రాజు ,తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి బాలయ్య ,హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బచ్చలకూరి ప్రసాద్, జిల్లామాదిగ మహిళా సమైక్య మారపల్లి సావిత్ర ,పిడమర్తి నాగేశ్వరి సూర్యాపేట మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్ ,ఆత్మకూరు మండల అధ్యక్షులు మేడి కృష్ణ ,చివ్వేంల మండల కన్వీనర్ చెరుకుపల్లి సతీష్ ,సూర్యాపేట పట్టణ ఎం ఎస్ పి పార్టీ ఇన్చార్జి దైద వెంకన్న, దాసరి వెంకన్న ,కందుకూరి శ్రీను ,కొండగడుపుల శ్రీను ,పోలేపాక సోమయ్య దాసరి వెంకన్న ,చింతల్ చెరువు శంకర్ ,మేడి వెంకన్న, బొడ్డు కుటుంబరావు ,లంజపెళ్లి శ్రీను, ములకలపల్లి మధు మిరియాల చిన్ని, దివ్యాంగుల సంఘం నాయకులు చింత సతీష్ ,చింత సాంబయ్య ,మిద్దె సైదులు ,బుద్ధ సంతోష్ ,రాము, నల్ల మేకల రామ్ కుమార్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!