ఏఎంసిలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గంగుల
కరీంనగర్ జిల్లా:
పచ్చని తెలంగాణలో కాంగ్రెస్… బిజెపిలు విషం చిమ్ముతున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. వారి మాటలు నమ్మి మోసపోతే… గోస పడక తప్పదన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కోటి 37 లక్షలతో చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి గంగుల భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కరీంనగర్ గడ్డ పై ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎవరు… వరుసగా 2వ సారి గెలువలేదని… కాని… మీ ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయాలు సాధించిన అదృష్టవంతునన్నారు మంత్రి గంగుల. మీరు 3 సార్లు గెలిపిస్తే… సిఎం కెసిఆర్ మంత్రి పదవిని కట్టబెట్టారన్నారు. నాపై మీరు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా… మారుమూల ప్రాంతాల్లో సైతం సిసి… బిటి రోడ్లు నిర్మించానన్నారు. వరదకాలువ నిర్మాణంతో… అచంపల్లి చెరువు కింది 7 చెరువులు నీరు లేక ఎండిపోతే… వాటికి తిరిగి పునర్జీవం పోసి… మండుటెండల్లో కాళేశ్వరం జలాలు తీసుకువచ్చి… మత్తడి దూకించానన్నారు. ఇప్పుడే తెలంగాణ ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకుందన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణ పై కాంగ్రెస్ బిజెపిలు విషం చిమ్ముతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడు ఉన్న చోట రాక్షసులు ఉన్నట్టు… వీరంతా మోపైండ్రని… వారి మాయ మాటలు నమ్మి అధికారం కట్టబెడితే… ఇక్కడి సంపదను మళ్ళీ దోచుకుంటారని ఆందోళనవ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని… ఢిల్లీ వారికి పట్టం కట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్… బిజెపిలు 5 కోట్లకో టికెట్ అమ్ముకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయని… వారి మాటలు నమ్మి గెలిపిస్తే… మన నోట్ల మన్నుకొడుతారన్నారు. అలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంత్రి గనులతో పాటు నగర మేయర్ వై సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డ వేణి మధు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, ఫ్రాక్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజ శేఖర్, టిఆర్ఎస్ నగర అధ్యక్షులు , చల్ల హరిశంకర్,, కరీంనగర్ రూరల్ మండలం అధ్యక్షుడు కాసరపు శ్రీనివాస్,, జడ్పి కోఆప్షన్ మెంబర్ సాబీర్ పాషా, బి. ఆర్ ఎస్. నాయకులు పిల్లి మహేష్,నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!