ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పిసిసి కార్యదర్శి బండ శంకర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల తిరుపతి డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయం సమీపంలో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే నీళ్లు నిధులు నియామకాలకై ఏర్పడిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ 8 సంవత్సరాలు పరిపాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా, ప్రకటించిన 3016/- నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల సమయం లో
సీ ఎం కేసిఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవే ఉండవని అందరినీ రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. గత ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న సమ గ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆర్ట్ టీ చర్లు పావని , రమేష్ లు రోడ్డుపై వేసిన రాధాకృష్ణ చిత్రపటం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఎస్ ఏ జేఏసీ నాయకులు నారాయణ, శ్రీనివాస్, రవీందర్, అంజయ్య, రమేష్, రాజేందర్, సురేష్, ఫరూఖ్, రవి పాల్గొన్నారు
[zombify_post]