బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి జగిత్యాల జిల్లాలో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందాపై ఫిర్యాదు చేశారు జగిత్యాల బీజేపీ నాయకుడు ముదుగంటి రవీందర్ రెడ్డి. నిరుపేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న పట్టించుకోని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు, నాచుపల్లి గోదాంలో రెండు లారీల అక్రమ రేషన్ బియ్యం దొరకగా పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు జిల్లాలలో విచ్చలవిడిగా రేషన్ బియ్యం దందా నడుస్తుందన్నారు. కిషన్ రెడ్డి ఈ విషయం మీద వెంటనే జగిత్యాల జిల్లా కలెక్టర్ తో, సివిల్ సప్లై కమిషనర్ తో మాట్లాడారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వారితో పాటు బిజేపి సీనియర్ నాయకులు ACS రాజు, సిపెల్లి రవీందర్,, లింగంపేట శ్రీనివాస్, కౌన్సిలర్ గుర్రం రాము, సతీష్, తదితరులు ఉన్నారు.
[zombify_post]