in , , ,

మహిళలకు33% రిజర్వేషన్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ కోటనువెంటనే ప్రకటించాలి

  • మహిళలకు 33శాతం రిజర్వేషన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ  కోటాను వెంటనే ప్రకటించాలి.

  • డీ లిమిటేషన్ తో సంబంధం లేకుండా 2024 ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి.

  • – బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిళ్లై.

సూర్యాపేట సెప్టెంబర్ 21:

మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదించడం హర్షణీయమని డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా 2024 ఎన్నికల్లోనే బిల్లును అమలు చేయాలని ప్రముఖ న్యాయవాది, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ  పిళ్లై డిమాండ్ చేశారు.

గురువారం స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మహిళలతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ ప్రవేశపెట్టారని అందులో బిసి, ఎస్సీ, ఎస్టీ కోటాను ప్రకటించాలని కోరగా వాయిదా వేసినట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం ఎలక్షన్ స్టంటుగా మెజార్టీ సభ్యులతో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని అన్నారు. బిల్లు ఆమోదించగానే సరిపోదని అందులో బిసి, ఎస్సీ, ఎస్టీ కోటాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 బిసి, ఎస్సీ, ఎస్టీ కోటాను ప్రకటించకుండా మహిళలకు 33శాతం రిజర్వేషన్ను అమలు చేస్తే తిరిగి అగ్రవర్ణాలకు అధికారం దక్కుతుందన్నారు.ఈ బిల్లును ఇప్పటికిప్పుడే అమల్లోకి తీసుకురావాలని అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ కోట ఉండాలని అన్ని పార్టీల వారు కోరుకుంటున్నారని అన్నారు. బిసి జనగణన చేసి 33 శాతం మహిళ రిజర్వేషన్ లో మహిళా కోటాను వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కంచుకొమ్ముల వెంకట్, బీసీ సంఘాల నాయకులు  బుద్ధ సత్యనారాయణ, చామకూరి నరసయ్య, బయ్య మల్లికార్జున్, నాయకురాలు అనపర్తి పద్మ, సారగండ్ల వెంకటమ్మ, కోడూరి నిర్మల,  కాసా అనసూయ,  వల్లమల్ల సైదమ్మ,  కొమర్రాజు నాగమ్మ తదితరులు ఉన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ఓబిసి బిల్లు అమలు చేయాలి

అభయాంజనేయ వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం