in , ,

ఎంబీబీఎస్ సీటు సాధించిన గిరిజన ఆణిముత్యం.

శ్రీ వంశిక కు. సన్మానం చేసిన ఎల్. హెచ్. పి. ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దశరథ్ నాయక్. తల్లాడ మండల కేంద్రంలోని మల్సూర్ తండా గ్రామంలో గిరిజన ఆణిముత్యమైన బానోత్ శ్రీ వంశిక కు ఎంబిబిస్ లో సీటు సాధించింది. శాలువాతో పూలమాలతో సత్కరించిన లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ధర్మసోత్ దశరథ్ నాయక్. దశరథ్ నాయక్ మాట్లాడుతూ మారుమూల తండాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన శ్రీ వంశిక ఎంబిబిఎస్ సీటు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ వంశిక 720 మార్కులకు 436 మార్కులు వచ్చాయి. ఆల్ ఇండియా ర్యాంక్ 180372, స్టేట్ ర్యాంక్ 5071 రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తరువాత వారి తండ్రి అయిన బానోత్ రామారావు, సరితలను శాలువలతో సత్కరించారు. శ్రీ వంశిక డాక్టర్ పూర్తి చేసిన తర్వాత గిరిజన తండాల్లో, గూడాల్లో ఉచిత సేవలు అందించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. తల్లాడ మండల అధ్యక్షుడు నాగేశ్వరావు నాయక్, కల్లూరు మండల అధ్యక్షుడు బానోత్ నందు నాయక్, మల్సూర్ తండా మాజీ సర్పంచ్ లింగయ్య నాయక్, రవి నాయక్, సైదా నాయక్, రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

జీవిత చరమాంకం వరకు పోరాడు… ఆత్మహత్యలు వద్దు…

సచివాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు.