విష్ణు యస్.వారియర్, పోలీస్ కమిషనర్, ఖమ్మం
విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు నిర్మిస్తున్న ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానున్నదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనులను పోలీస్ కమిషనర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్, నిబంధనలకు సంబంధించిన చిత్రాలు, ఆట స్థలంతో పాటు ద్విచక్ర వాహనం ఎలా నడపాలో వివరించేందుకు సిమిలేటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా సౌకర్యాలు ఉండే విధంగా నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారికి రోడ్డు ప్రమాదాల వీడియోలు ప్రదర్శించి అవగాహన పెంపొందించే విధంగా కౌన్సిలింగ్ సెంటర్‌ను, సెమినార్ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలతో సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు అవగాహనతో పాటు మెరుగైన సేవలందించి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని పెర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి, సీఐ అశోక్, ట్రాఫిక్ ఏఎస్ ఐ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
