సంక్షేమ పథకాల అమలు బీఆర్ఎస్ తోనే సాధ్యమని మండల అధ్యక్షులు సోయం రాజారావు, మండల ప్రధాన కార్యదర్శి లంక రాజు తెలియజేశారు. శుక్రవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీ ఆర్ ఎస్ లో చేరిన చర్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిపి గీదా కోదండ రామయ్య, గుడపాటి సతీష్ లను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా చర్ల సోయం రాజారావు నివాసంలో సోయం రాజారావు, లంక రాజు ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బంధు, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఈ సారి భద్రాచలంలో వేగిరెది గులాబీ జెండా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు కుమార్ రాజా, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, మండల యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, తెగడ ఉప సర్పంచ్ శ్యామల శివ, పార్టీ సీనియర్ నాయకులు అజీజ్, పోట్రు బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, బోళ్ళ వినోద్, ఆకారపు పవన్, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!