in ,

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మువ్వా

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా నియామకమైన మువ్వా విజయ్ బాబు ను సన్మానించిన మానవతారాయ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా సత్తుపల్లి నియోజకవర్గం లంకపల్లికి చెందిన డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయబాబును ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం శనివారం రాత్రి నియమించింది. డిసిసిబి బ్యాంకు వార్షిక ఆదాయాన్ని రూ.1000 కోట్ల నుండి రూ.2000 కోట్ల వరకు పెంచిన విజయబాబును కీలక పదవి వరించడం పట్ల సత్తుపల్లి కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మంలోని మువ్వా ఇంటికి వెళ్లి శాలువాతో ఘన సన్మానం చేశారు. లంకపల్లి నుంచి కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎదిగిన మువ్వా విజయ్ బాబుకు భవిష్యత్తులో పార్టీలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని మానవతారాయ్ అన్నారు. విజయ్ బాబుకు ఈ పదవి దక్కటం కోసం కృషిచేసిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు బట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ సహ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు సంభాని చంద్రశేఖర్, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరిలకు సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రావి నాగేశ్వరావు, బుక్కా కృష్ణవేణి, ఫజల్ రెహమాన్ బాబా, కర్నాటి వెంకటరెడ్డి, కొమ్మేపల్లి బాజీ, జానీ పాషా, భూక్య రవీంద్ర, వెల్లంపల్లి ఏడుకొండలు, పాకాల గూడెం బడే సాహెబ్, ఇడుపులపాటి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

గరికపాడు వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్న పోలీసులు

G20 సదస్సులో కరీంనగర్ జిల్లాకు అరుదైన గౌరవం