మూడోసారి అధికారం మాదే బీఆర్ఎస్…
విస్తృత స్థాయి సమావేశంలో తాత మధు వ్యాఖ్యలు
కాంగ్రెస్ పై ఖమ్మం ఎమ్మెల్సి భద్రాచలం ఇంచార్జ్ తాత మధు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శనివారం చర్ల కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపే చూస్తోందని, ఫించన్లు, రైతు బంధు పెంపుపై కసరత్తులు చేస్తున్నాయని అన్నారు. ఇక బీఆర్ఎస్ మేనిఫోస్టో చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని, మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని తాత మధు ధీమా వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ డకౌట్ ఖాయమని మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. భవిష్యత్ బాగుండాలంటే బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని తాత మధు ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హయాంలో కరువు లేదన్నారు. కరువు,లు లేకుండా ప్రశాంతంగా పరిపాలన సాగుతుందన్నారు. కేసీఆర్ ఢిల్లీని కదిలించి తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ రాకపోతే కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు వచ్చేవా అని ప్రశ్నించారు.
This post was created with our nice and easy submission form. Create your post!