‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం సెప్టెంబర్ 17' న ఖమ్మం లో జాతీయ జెండాను మంత్రి పువ్వాడ కుమార్ ఎగురవేయ నున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయించింది. ఆ రోజున నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ గారు జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో సెప్టెంబర్ 17న ఉదయం 9.00గంటలకు నిర్వహించే కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
[zombify_post]