కొండా చరణ్ పై చర్ల పోలీసులు పెట్టిన ఉప కేసును ఎత్తివేయాలని కోరుతూ, కామ్రేడ్ కొండా చరణ్ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి, చర్ల మండలంలో అనేక ప్రజా సమస్యలపై జరిగిన ఉద్యమాలలో నాయకత్వం వహించాడు. ఇటీవల గోదావరి వరద ముంపు బాధితులకు ఎత్తు ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాడాడు. అయితే ఇండ్ల స్థలాల పోరాటంలో పోలీసులు తమ స్థలం సర్వే నంబర్ 117 నీ ఆక్రమించామని కక్ష పెట్టుకొని మావోయిస్టులతో చరణ్ కు సంబంధాలు ఉన్నాయని అంటగట్టి ఉపా కేసు పెట్టి సెప్టెంబర్ 24న ఖమ్మం జైలుకు పంపారు. ఇది అన్యాయం కనుక చరణ్ పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని తహసీల్దార్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా పంథా పార్టీ జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి, డివిజన్ సభ్యులు సాయన్న మండల కమిటీ సభ్యులు సుక్కన్న, లక్ష్మి, కౌశిక్, పార్టీ సభ్యులు శ్రీ కల పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!