దేవరాపల్లి, అనకాపల్లి జిల్లా: మండల కేంద్రంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. *సత్యసాయి సామాజిక భవనానికి 5 లక్షలు వితరణ* . మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్క్ ను అనుకొని ఉన్న స్థలాన్ని మంత్రి బూడి ముత్యాలనాయుడు సహాయ సహకారంతో సత్యసాయి సామాజిక భవనానికి కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి మంత్రి నేడు భూమి పూజ చేశారు. అనంతరం భవన నిర్మాణానికి 5 లక్షలు రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర రావు, ఎంపిపి రాజేశ్వరి భాస్కర్, పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు, జెడ్పీటీసీ కర్రీ సత్యం పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]