జననీ జన్మభూమి స్టూడెంట్స్ సూసైడ్స్ అండ్ క్రైమ్స్ ఎరాడికేషన్ సొసైటీ
(జె జె ఎస్ ) ఆధ్వర్యంలో …ప్రపంచ ఆత్మహత్యల నిర్మూలన దినం సందర్భంగా ఆత్మహత్యల నిర్మూలన పై ర్యాలీ తీశారు, అదేవిధంగా నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జె జె జె వ్యవస్థాపక అధ్యక్షుడు కొమురవెల్లి భూమేశ్ మాట్లాడుతూ…
జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా అఖండమైన ధైర్యంతో ఆశావహ దృక్పథంతో వంద శాతం ప్రయత్నం చేస్తే పరిష్కారం లభిస్తుందని అన్నారు.అదేవిధంగా ఫెయిల్ అయ్యామని, మార్కులు రాలేదని, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకోవద్దని మళ్లీ మళ్లీ తిరిగి ప్రయత్నం చేయాలని ఈ ఈ ప్రకృతి దారి చూపిస్తుంది అన్నారు.అదేవిధంగా జె జె ఎస్ సలహాదారులు ,సైకాలాజిస్ట్ లు బి. రాజేందర్ & వి.పవన్ లు మాట్లాడుతూ సృష్టిలో ఏ జీవి ఆత్మహత్య చేసుకోదని మనిషి తన జీవితం అవగాహన పెంచుకొని ముందుకు సాగాలని సూచించారు,
జె జె ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 4 లక్షల మంది కి పైగా *ఆత్మహత్యల నిర్మూలన పై అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జె జె ఎస్ ఉపాధ్యక్షుడు పి. హరీశ్ , ప్రధాన కార్యదర్శి డా.ఎస్ నాగేంద్ర శర్మ, సహాయ కార్యదర్శి యు.సాయి కృష్ణ ,సలహాదారు కె.నరేశ్ ,జిల్లా నాయకులు రాం చంద్రం,శ్రీనివాస చారి,రైతు సంఘం అధ్యక్షులు పి .తిరుపతి రెడ్డి ,జె జె ఎస్ సభ్యులు టి. నరేశ్, విద్యార్థిని విద్యార్థులు ,పట్టణ ప్రజలు,యువకులు పలువురు పాల్గొన్నారు.
[zombify_post]