in ,

విధేయతకు పట్టం కట్టిన AICC

నాయుడు సత్యనారాయణ గౌడ్ కు కీలక పదవి

 AICC అగ్ర నాయకత్వం నా పనితీరును గుర్తించి స్ట్రాటజీ కమిటీలో పబ్లిసిటీ మెంబర్ గా నియమించినందుకు సోనియా గాంధీ, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ, AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నాయకులు మల్లు భట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు హృదయ పూర్వక ధన్యవాదాలు నాయుడు సత్యనారాయణ గౌడ్ తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా 60% ఉన్న BC లను ఏకం చేసి సామాజిక న్యాయం వర్థిల్లే విధంగా  కృషి చేస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారిని, పని చేసే వారిని ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుందని, రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు  కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజల, సబ్బండ వర్గాల ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉంచుతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

టీడీపీ నాయకురాలు అనిత ఇంటి వద్ద ఉద్రిక్తత

జీవిత చరమాంకం వరకు పోరాడు… ఆత్మహత్యలు వద్దు…