తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.30కు ఖమ్మం ZP సెంటర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారు. 9గం రఘునాధపాలెం ప్రగతి ప్రైడ్ ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు. 9.50కు ఖమ్మం – SP స్టేడియం లో ఖేలో ఇండియా లో భాగంగా ఖమ్మం జిల్లా మహిళల లీగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ ను ప్రారంభోత్సవం చేయనున్నారు. 10.10కు ఖమ్మం – NSP క్యాంపులో PRTU కార్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. 10.50కు ఖమ్మం – ముస్తఫా నగర్ లో హోటల్ ప్రారంభోత్సవం చేస్తారు. 11.05కు ఖమ్మం – కొత్తూరు, బోనకల్ రోడ్ లోని నూతనంగా నిర్మించిన MMR ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం చేస్తారు. 11.30కు ARR – ముదిగొండలో సత్యసాయి రైస్ మిల్లు ప్రారంభోత్సవం చేస్తారు. ఇక మధ్యాహ్నం 12కు ఖమ్మం జూబ్లీ క్లబ్, జూబ్లీపుర వద్ద షటిల్ ఆడిటోరియం ప్రారంభోత్సవం చేస్తారు. 12.30కు ఖమ్మం మేదరి బజార్ లోని 39 డివిజన్ లో ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు. 1.00కి ఖమ్మం SR గార్డెన్స్ లో ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు. లంచ్ బ్రేక్ తర్వాత సాయంత్రం 4.00కు ఖమ్మం బొక్కలగడ్డ లోని 47 డివిజన్ లో మున్నేరు వరద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ చేస్తారు. రాత్రి 7.00కి ఖమ్మం VDOs కాలనీ లో జరిగే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు.
[zombify_post]