సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కోలగట్ల చెన్నారావు, పారేపల్లి బాలాజీ చారి, బండారు జగదీశ్, ఎం.డి కమల్ పాషా, సత్తుపల్లి నియోజకవర్గ NSUI అధ్యక్షులు అర్వపల్లి సందీప్ గౌడ్, కొండపల్లి మహేష్, నవీన్ గౌడ్, షేక్ సుభాని, కృష్ణకాంత్, వినోద్, ఉతేజ్, కొండపల్లి శ్రీకాంత్, ఒంటెద్దు సాయిలు, కోటమర్తి జవహర్ లాల్, ఉకే రమేష్, కోటమర్తి రమేష్, బత్తుల మోహనరావు, బత్తుల నాగరాజు, ప్రకాంత్ రెడ్డి, బెజవాడ మనోజ్ కుమార్, బండారు రాజేష్, బండారు రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి (చిట్యాల) ఐలమ్మ.. అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖులను ఎదుర్కొన్నదని అన్నారు. నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలైన ఐలమ్మ.. రాయపర్తి మండలం కిష్ట పురంలో 1895, సెప్టెంబర్ 26న జన్మించారనీ, పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెండ్లి జరిగిందనీ, వారికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డల సంతానమని తెలిపారు. చాకలి ఐలమ్మ కుల వృత్తి జీవన ఆధారంగా బతికింది. అలాగే మల్లంపల్లి కొండల రావుకు చెందిన పాలకుర్తిలోని భూమిని కౌలుకి తీసుకొంది. నాలుగు ఎకరాలు పంట పండించింది. అయితే ఆ సమయంలో స్థానిక పట్వారీ పొలంలో పనికి రాని ఐలమ్మ పై కమ్యూనిస్టులలో చేరిందని, ఆయన దేశ్ ముఖ్ కి ఫిర్యాదు చేశాడు. ఐలమ్మ సాగు చేసిన పొలాన్ని తన పేరున రాయించుకొని ఆ పొలం తనదేనని, ఆ పంట కూడా తనదేనని తన మనుషులను పంపించాడు. సంఘం సహాయంతో వాళ్ళని తిప్పి పంపిన ఐలమ్మ కోర్టులో కేసు వేసి, అనాడు పేరు మోసిన లాయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో గెలిచింది. నాడు సంగంగా పిలిచే కమ్యూనిస్టులతో చేయి కలిపి తన పొలాన్ని దేశ్ ముఖ్ గుండాల నుండి కాపాడుకుంది. వారు చేసిన ఆనాటి ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందనీ, ఆ తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని దయానంద్ అన్నారు.
[zombify_post]