in , ,

ఖమ్మం కార్పొరేషన్ కు మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు

మంత్రిగా నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ కి జీవో అందజేసిన మంత్రి కేటీఆర్. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కేటీఆర్ లకు చేసిన విజ్ఞప్తి మేరకు TUFIDC (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఖమ్మం కు రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. నేడు ఐటి మరియు పురపాలక శాఖ  మంత్రి కేటీఆర్ చేతుల మీదగా జీవో కాపీ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమారికి అందజేశారు. ఖమ్మం అభివృద్ధికి మరో 100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నాలుగేళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న అజయ్ కుమార్ కి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు

పండ్ల అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీశ్రీశ్రీనూకాలమ్మ అమ్మవారు.