-
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ.
-
సూర్యాపేట కలెక్టరెట్ లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.
-
నివాళులర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
సబ్బండ వర్ణాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక ధీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్ లో ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు.వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిస సంకెళ్ల విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి కొనియాడారు. ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో విస్మరణకు గురైన ఐలమ్మను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ వీరనారి ఐలమ్మ వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ సరైన గౌరవం కల్పించారన్నారు.నేడు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నంబర్ వన్‌గా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మనం కూర్చున్న నూతన కలెక్టరెట్ దీనికి నిదర్శనం అన్నారు.కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, రాష్ట్రం అంతటా అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబి ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించాం అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశాం అని అన్నారు.మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, జడ్పీటిసి సంజీవ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ జహీర్, పలువురు రజక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు.వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిస సంకెళ్ల విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి కొనియాడారు. ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో విస్మరణకు గురైన ఐలమ్మను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ వీరనారి ఐలమ్మ వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ సరైన గౌరవం కల్పించారన్నారు.నేడు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నంబర్ వన్‌గా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మనం కూర్చున్న నూతన కలెక్టరెట్ దీనికి నిదర్శనం అన్నారు.కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, రాష్ట్రం అంతటా అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబి ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించాం అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశాం అని అన్నారు.మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, జడ్పీటిసి సంజీవ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ జహీర్, పలువురు రజక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]