జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ఖ
ఖమ్మం లకారం ట్యాంకుబండపై తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధురాలు బహుజన కులాల కీర్తిని పతాక స్థాయికి చేర్చిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తగుంట్ల లక్ష్మి, రజక సంఘం నాయకులు కొండలరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి, మహాత్మ జ్యోతిబాపూలే ఐడియాలజీ సొసైటీ అధ్యక్షులు పి విజయకుమార్ సీనియర్ బీసీ నాయకులు పోలీస్ వెంకన్న తో కలిసి వినతి పత్రాన్ని అందించారు*. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పందిస్తూ ఈనెల 26న చిట్యాల ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే దానికోసం నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి నలమాస సుగుణ, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు మరీదు శీను, యువజన విభాగం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మరీదు ప్రసాదు, రజక సంఘం నాయకులు ముదిగొండ వెంకటప్పయ్య, జక్కుల రామారావు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.
[zombify_post]