కొవ్వూరు: నేషనల్ హైవే నుంచి కొవ్వూరు వచ్చే మార్గంలో సైన్ బోర్డు సరిగా లేకపోవడాన్ని గమనించిన రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొవ్వూరు టౌన్ లోకి వచ్చేందుకు వీలుగా నేషనల్ హైవేలో ఏర్పాటు చేసిన సైన్ బోర్డు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. మార్గంపై స్థానిక ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ… కొత్తవారు, ప్రయాణికులు రాజమండ్రి వరకూ వెళ్లి వెనక్కి తిరిగి రావాల్సిన ఘటనలు జరుగుతున్నాయన్నారు. వెంటనే సైన్ బోర్డును మార్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిరిగి క్యాంపు ఆఫీసుకు వస్తున్న సమయంలో ఇది జరగడం గమనార్హం..
This post was created with our nice and easy submission form. Create your post!