కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో హోంమంత్రి తానేటి వనిత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9 నుండి సాయంత్రం వరకూ ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు & రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు రాజీవ్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వివిధ కార్పోరేషన్ల డైరెక్టర్లు, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, కొవ్వూరు నియోజకవర్గ మండలాల పార్టీ అధ్య క్షులు, జేసీఎస్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, తదితరులు హాజరయ్యారు.
This post was created with our nice and easy submission form. Create your post!