ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం రాత్రి నిర్వహించిన ఆశ్వీయుజ మాస తిరు కళ్యాణ మహోత్సవంలో హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీదేవి భూదేవి సమెతుడైన ఆ శ్రీనివాసుని కల్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశంలో మునిగిపోయారు. స్వామి వారి వివాహ మహోత్సవానికి దేవాలయ తూర్పు రాజగోపురం ముందర మండపంలో ప్రత్యేక కల్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ముందుగా స్వామి అమ్మవార్లను వేరువేరు వాహనాలలో కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి, అమ్మ వాళ్లకు ప్రభుత్వం తరఫున హోంమంత్రి తానేటి వనిత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాలు నడుమ, వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జిలకర, బెల్లం పూర్తి చేశారు. ఆ తర్వాత స్వామివారి కల్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అందరికీ స్వామి వారి కరుణా కటాక్షాలు, ఆశీస్సులు ఉండాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!