రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత ఇల్లు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. శనివారం తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో హోంమంత్రి పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతిపేదవానికి సొంత ఇల్లు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వటం జరిగిందనిన్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక లబ్ధిదారులకు సొంత పంచాయతీల్లోనే ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బల్లిపాడు గ్రామం ప్రజలకు మొదట తిరుగుడుమెట్టలో స్థలాలను కేటాయించినప్పటికీ.. స్థానికులు దగ్గరగా కేటాయించాలని కోరారని గుర్తుచేశారు. దీంతో వెంటనే చర్యలు తీసుకుని గ్రామానికి సరిహద్దు ప్రాంతంలో ఇరిగేషన్ స్థలాలను కేటాయిస్తే.. ప్రతిపక్ష పార్టీల నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సమస్యలు తొలగి 30 మందికి తమ చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలను అందిచడం సంతోషకరంగా ఉందన్నారు. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా ఇళ్ల స్థలాలకు అర్హులై మిగిలిపోయి ఉంటే వాళ్లు కూడా అప్లై చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలను అందిస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!