in ,

సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు: హోం మంత్రి వనిత

కొవ్వూరు మండలం ఐ పంగిడి   గ్రామంలో 135 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి డా.తానేటి వనిత పాల్గొన్నారు. సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ఏ ఇంటికి వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతోందన్నారు. సీఎం జగన్  అందిస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాల రూపంలో లబ్ది చేకూరుతోందన్నారు. ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలనే సదుద్దేశంతో సీఎం జగన్  పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ప్రజల నుండి వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా అధికారులు వెంటనే పరిష్కరించాలని హోంమంత్రి తానేటి వనిత  ఆదేశించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

సచివాలయం భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి వనిత

బి.ఎస్.పి పార్టీ ఆశవర్కర్లకు మద్దతు