జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయడం అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది మా ప్రభుత్వ విధానమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందేలా అత్యాధునిక పరికరాలతో నిపుణులైన వైద్య సిబ్బందితో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. బుధవారం తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను పరిశీలించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్ వాడీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని పౌష్టికాహారం కలిగిన ఆహార పదార్థాలను అందరికీ పంచిపెట్టారు. అలాగే స్టాలలోని వైద్యులతో, సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికి విచ్చేసిన రోగులను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలసుకున్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్యరంగంలో అనేక వినూత్న సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష పధకం ద్వారా ప్రజలందరికి ఆరోగ్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందచేస్తున్నామన్నారు. అవసరమైన వారికి తదుపరి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పల్లెలు, గ్రామాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు స్పెషలిస్టు డాక్టర్లు వచ్చి వైద్యం అందించడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మహిళలకు సంబంధించి గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, చిన్నపిల్లల నిపుణులు, కంటికి సంబంధించి, ఇతర డాక్టర్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ శిబిరంలో 11 రకాల పరీక్షలను కూడా వారికి నిర్వహించడం జరుగుతుందన్నారు. అవసరాన్ని బట్టి వారికి అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహించి వారికి తగు వైద్యం అందిస్తూ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే వారికి ప్రతి నెల కు సంబంధించి మందులు ఉంటాయని రాబోవు రోజుల్లో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఎంతో బృహత్తరమైన కార్యక్రమమని అన్నారు. ఈ శిబిరంలో అనేక రకాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని హెల్ప్ డెస్క్, స్పాట్ కౌంటర్, వివిధ పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈసీజీ, రక్త పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేయడంతో పాటు పెద్ద ఆసుపత్రులకు కూడా రెఫర్ కూడా ఇక్కడి నుండే చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉండే పేద నిరుపేదలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని వారి యొక్క ఆరోగ్య సురక్ష ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చక్కటి కార్యక్రమాన్ని దేశం లో ఏ రాష్ట్రం చేపట్టలేని విధంగా మన రాష్ట్రంలో ప్రారంభించడం ఎంతో గర్వకారణంగా ఉందని హోంమంత్రి తానేటి వనిత ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!