జగనన్న నాలుగేన్నర ఏళ్ళ పాలనలో రాష్ట్రంలోని ప్రతి గడపలో అర్హతల ప్రకారం సంక్షేమ ఫలాలు లభించాయని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మంగళవారం చాగల్లు మండలం చాగల్లు సచివాలయ పరిధిలో 145వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. చాగల్లులోని ఎస్సీ కాలనీ కొత్తపేటలో బాబూ జగజ్జీవన్ రామ్ వీధి నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ అడుగులు వేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు, అభిమానులు హారతులు ఇస్తూ హోంమంత్రి కి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని ఆమె అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేయగా నేడు మన జగనన్న ప్రభుత్వంలో అర్హులను జల్లెడ పట్టి వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. ఎక్కడా అవినీతికి, లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్, పూలే, మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతుందని తెలిపారు.ఈ ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లాలని చూసినా.. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు కాబట్టి వాటిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని ప్రజలను ఆమె కోరారు. ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి తమ ప్రభుత్వ హాయాంలో ఈ మేలు చేశామని చెప్పగలుగుతున్నామన్నారు. అందుకే జగనన్న ప్రభుత్వం జనం మెచ్చిన ప్రభుత్వమని, పేదల పక్షపాత ప్రభుత్వమని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!