in , ,

ముఖ్యమంత్రి జగన్ మీ ఇంటి బిడ్డ.. ఆశీర్వదించండి : హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా:
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందని.. ఇది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విజనరీకి తార్కాణమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గురువారం నాడు ఫేజ్-2 కింద మంజూరైన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొవ్వూరు పట్టణం లిటరరీ క్లబ్ లో కొవ్వూరు రూరల్ మండలం కొత్త పెన్షన్ లబ్ధిదారులకు, తాళ్లపూడి మండలం తాళ్లపూడిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తాళ్లపూడి మండలంలోని కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి కొవ్వూరు రూరల్ మండలంలో 388 మందికి, తాళ్లపూడి మండలంలో 310 మందికి మొత్తం 698 మందికి హోంమంత్రి స్వయంగా పెన్షన్లు అందజేశారు..
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మీ ఇంటి బిడ్డగా ఆలోచించి.. ఎవరికి, ఏ అవసరం ఉన్నా.. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నారని తెలిపారు. ఆగస్టు నెల తర్వాత ఫేజ్-1 క్రింద కేవలం కొవ్వూరు రూరల్ మండలంలో  219 మందికి, ఫేజ్-2 క్రింద 388 కొత్తవారు ఎంపికై మండలంలో మొత్తం 10,428 మందికి 2కోట్ల 81లక్షల 59వేల 750 రూపాయలను నెలకు అందజేస్తున్నామన్నారు. అలాగే తాళ్లపూడి మండలంలో ఫేజ్-1 క్రింద 176 మందికి, ఫేజ్-2 క్రింద 310 మందికి మంజూరు కాగా.. మొత్తం తాళ్లపూడి మండంలో 7,957 మందికి నెలకు 2 కోట్ల 16 లక్షల 12 వేల 750 రూపాయలు అందజేస్తున్నామన్నారు.  గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్‌ ప్రస్తుతం రూ.2750కి పెంచి ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో 2014 – 19 కాలంలో సగటున నెలకు ఖర్చు చేసింది కేవలం రూ. 400 కోట్లు మాత్రమేనని.. జగనన్న ప్రభుత్వంలో నెలకు రూ. 1,800 కోట్లును అందిస్తున్నామని తెలిపారు.   గతంలో ఉన్న కోటాలు, కోతలు, వీలైనంత మందికి ఎలా ఆలోచనలు లేవనన్నారు. కులం, మతం, వర్గం, ఏ పార్టీ అనేది కూడా చూడకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గతంలోలా లంచాలు, వివక్ష, మధ్య దళారీలు, బ్రోకర్లు, పక్షపాత జన్మభూమి కమిటీలు వంటివి లేవన్నారు. ప్రతి నెలా మొదటి రోజే అది ఆదివారమైనా, సెలవుదినమైనా మీ గడప ముందుకొచ్చి వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేస్తున్నారని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. పిల్లలకు అమ్మఒడి, మహిళలకు చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి ఎన్నో పథకాల అమలు మహిళా సాధికారిత వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.  వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి కూడా లబ్ధి చేకూర్చాలని.. ఏ ఒక్కరూ మిస్ కాకూడదని జల్లెడ పట్టి మరీ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలను రూపుదిద్ది అమలు చేశామని హోంమంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా సీఎం బాధ్యతలు తీసుకుని అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనను విజయవంతం చేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా..  గత పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాలను ప్రజలు గమనించి.. జగనన్న ప్రభుత్వానికి మరొక్కసారి మీ చల్లని దీవెనలతో ఆశీర్వాదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.  
ఈ కార్యక్రమంలో కొవ్వూరు, తాళ్లపూడి మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు,  నియోజకవర్గంలోని నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నూతన పెన్షన్ దారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

వాయిదా పడ్డ విజయభేరి సభ…

ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉండాలి