పాడేరు, అల్లూరి జిల్లా: వైద్యుల నివాస సముదాయాల నిర్మాణాలను అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. స్థానిక మలేరియా కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న వైద్యాధికారుల నివాస గృహాల నిర్మాణపు పనులను ఐటిడిఏ పిఓ వి. అభిషేక్ తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుల నివాస గృహాల నిర్మాణాలకు మరో.15 లక్షల నిధులు విడుదల చేస్తామన్నారు. భవన నిర్మాణాలలో ఎక్కడా రాజీ లేకుండా పటిష్టమైన నాణ్యతలు పాటించాలని స్పష్టం చేసారు. వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ డి. వి. ఆర్. ఎం. రాజు, డి ఇ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]