ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న పాడేరులో నిర్వహించే జాబ్‌మేళాను నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కోరారు. జాబ్‌మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఉదయం నిర్వహించే జాబ్‌మేళాకు పలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరవుతారన్నారు.టెన్త్, ఇంటర్‌తో పాటు ఉన్నత విద్యార్హత ఉన్న నిరుద్యోగ అభ్యర్థులంతా తమ ఒరిజనల్ ధ్రువపత్రాలతో జాబ్‌మేళాకు హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి పిట్టా నవీన్ పాల్గొన్నారు.
[zombify_post]