ముంచంగిపుట్టు, అల్లూరి జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టును గ్రామస్తులు శ్రమదానంతో మరమ్మతులు చేపట్టారు . వివరాలు ఇలా ఉన్నాయి.అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం సంగంవలస గ్రామంలో ఇటీవల కాలంలో నిర్మించిన కల్వర్టు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దాదాపు 30 గ్రామాలకు మండల కేంద్రానికి రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయం సోషల్ మీడియా తో పాటు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయినా ఇటు పాలకులు గాని, అటు అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వారం రోజులుగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో సోమవారం కొర్ర త్రినాథ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమీపంలో సెల్ టవర్ నిర్మాణానికి వచ్చి ప్రోక్లేనర్ సహాయంతో తూరులు సరిచేసుకుని తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
[zombify_post]