అల్లూరి జిల్లా: చింతపల్లి మండలం అంతర్ల నుంచి రింతాడ వరకు రహదారి బురదమయంగా మారింది. కృష్ణాపురం నుంచి మడిగుంట మీదుగా రాజుపాకలు వరకు రహదారి విస్తరిస్తున్నారు. విస్తరణలో భాగంగా కొండను తొలచి మట్టిని చదును చేస్తున్నారు. వర్షాల కారణంగా ఇక్కడ రోడ్డు అంతా బురదమయంగా మారి వాహనాలు కూరుకుపోతున్నాయి.ద్విచక్రవాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చింతపల్లి పరిధిలో చాపరాతిపాలెం నుంచి లంబసింగి మీదుగా ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అటవీశాఖ అనుమతి రావడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు తొలగించారు. కొన్నిచోట్ల కల్వర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారి దారుణంగా మారుతోంది.
[zombify_post]