అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంకు చెందిన వారా నూకరాజు, గతంలో CPI పార్టిలో పని చేసి, రాజకీయాలు నేర్చుకొని ఆ పార్టిని వదిలి అధికార పార్టిలో కొయ్యూరు ZPTCగా పదవి పొందాడు. అప్పటి నుండి కొయ్యూరు, నర్సీపట్నం, గొలుగొండ,రోలుగుంట మండలాలో భూ కబ్జాలు,దందాలు మొదలు పెట్టాడు. రోలుగుంట మండలం, MK పట్టణం శివారు చటర్జిపురం ఆదివాసీల సాగులో వున్న భూమిపై కన్ను వేసి, చాలా కాలంగా అక్కడి ఆదివాసీలను వేధిస్తున్నాడని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మోసురి రాజు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ పలుకుబడితో కేసులు నమోదుగాకుండా, రికార్డులలో ఆదివాసీల పేర్లు తీయించేసి,వారిని బెదిరిస్తున్నాడు.
పలుమార్లు కిరాయి మనుషుల తోడు తీసుకొని ఆదివాసీల పంటలు నాశనం చేయిస్తూ వస్తున్నాడు. ఇతనిపైన, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పైన ఆదివాసీలు నర్సీపట్నం కోర్టులో O.S. 24/ 2022 The Principal Junior Civil Judge Court కేసు దాఖలు చేసారు. సోమవారం (18వ తేది) అతని కుటుంబ సభ్యులు కొందరు వచ్చి కేదారి రాజు వేసుకున్న అరటి తోటను ధ్వంసం చేసారు. ఈ రోజు అనగా బుధవారం (20వ తేది) కొంత మంది కిరాయి మనుషులతో వచ్చి జీడి మామిడి, అరటి, జామ తోటలను మరల ధ్వంసం చేసారు. వారా నూకరాజు భూ ఆక్రమణలను,ఆదివాసీల పంటల విధ్వంసాన్ని మేము ఖండిస్తున్నాం. వారా నూకరాజు పై తగు చర్యలు తీసుకోవాలని, ఆదివాసీలు (PVTG ) యైన మాకు తగిన న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నాము.
[zombify_post]