పాడేరు, అల్లూరి జిల్లా: ఆపదలో ఉన్న గిరిజనులకు అత్యవసర సేవలు అందించడానికి రెడ్ క్రాస్ అంబులెన్సు సేవలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నిధులు రూ.25 లక్షలతో కొనుగోలు చేసిన కొత్త అంబులెన్సును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్ సంయుక్తంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్సును కెజిహెచ్‌లో ఉన్న ట్రైబల్ సెల్‌కు కేటాయిస్తున్నామని చెప్పారు. అత్యవసర వైద్య సేవలు అందించడానికి , పార్ధివ దేహాలు తరలించడానికి వినియోగించాలని నిర్వాహకులను ఆదేశించారు. గిరిజనులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ముందుగా అంబులెన్సులో ఉన్న సదుపాయాలను ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కో ఆర్డినేటర్ లోహిథాస్, సభ్యులు పి. సూర్యారావు, సంజీవి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]